కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ ఇంకా అమల్లోనే ఉంది. ఈ క్రమంలో 2 నెలల తరువాత వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఎప్పుడూ నెలలో 500 దాటని వారికి 5 వేల రూపాయలు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల్లో యూనిట్ ల వాడకం పెరిగి కమర్షియల్ స్థాయిలో యూనిట్ ధర 6.50 రూపాయలు పడుతూ ఒక్కసారిగా 5 వేలు బిల్లు వస్తోందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అంతంత బిల్లులను తాము ఎలా చెల్లించాలంటూ ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.