ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు మాధ్యమం అమలు పిటిషన్​పై విచారణ - ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అమలు తాజా వార్తలు

ఆంగ్ల మాధ్యమంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని అమలు వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ఆ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అమలు పిటిషన్​పై విచారణ వాయిదా
ఆ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అమలు పిటిషన్​పై విచారణ వాయిదా

By

Published : May 15, 2020, 12:15 AM IST

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29, ఏపీ విద్యా చట్టం సెక్షన్ 1, ఆంగ్ల మాధ్యమంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరతూ గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర మానవ వనరులశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ కె లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ఇవీ చదవండి

వలస కూలీల సమస్యపై విచారణ రేపటికి వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details