వివిధ శాఖల్లోని పోలీసు సిబ్బంది బదిలీలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం మెమో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ర్యాంకుల్లో ఉన్న సిబ్బంది బదిలీలను వాయిదా వేయాలని రైల్వే, ఇంటెలిజెన్స్ , సీఐడీ, ఏపీఎస్పీ, జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ మెమోలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సిబ్బంది బదిలీలను వాయిదా వేయాలని డీజీపీ ఆదేశం - ap dgp gowtham sawang news
పోలీసు సిబ్బంది బదిలీల విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ర్యాంకుల్లోని సిబ్బంది బదిలీలను నిలిపివేయాలని వివిధ శాఖలను ఆదేశించారు.
ap dgp