Post office covers: మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యతు తరాలకు అందించేందుకు తపాలాశాఖ తపాలా కవర్లు ముద్రించి, విడుదల చేస్తున్నట్లు విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తెలిపారు. భారత తపాలా శాఖ స్టాంపులు, ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేస్తూ.. ఫిలాటెలీ హాబీని పరిచయం చేస్తోందన్నారు. ఫిలాటెలీ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వినోదాన్ని కూడా పంచుతోందన్నారు. ఈ మేరకు విజయవాడలో భారతీయ తపాలా శాఖ ముద్రించిన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేశారు.
ఫిలాటెలీ అనేది పాఠశాల విద్యార్థుల్లో ప్రోత్సహించాలని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సబ్జెక్టు ద్వారా అనేక విషయాలపై తపాలా కవర్లు విడుదల చేశారని, చారిత్రక, సంప్రదాయాలు, వింతలు, విడ్డూరాలు, పంచారామాలు,... అరుదైన పక్షులు, జంతువులూ, మడ అడవులు, ఆజాదికా అమృత మహోత్సవాల్లో భాగంగా అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో తపాలా కవర్లు విడుదల చేశారన్నారు.