ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్​తో పోస్కో ప్రతినిధులు భేటీ - korian company posco news

ఆంధ్రప్రదేశ్​లో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంసిద్ధత వ్యక్తం చేసింది. గురువారం ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు... ఈ విషయాన్ని వెల్లడించారు.

POSCO Officials met cm jagan
POSCO Officials met cm jagan

By

Published : Oct 29, 2020, 6:49 PM IST

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఉక్కు ఉత్పత్తి సంస్థ 'పోస్కో' వెల్లడించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పోస్కో ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. పోస్కో ఇండియా గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగ్‌ లై చున్, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ గూ యంగ్‌ అన్, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జంగ్‌ లే పార్క్‌ తదితరులు సీఎంను కలిశారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు పోస్కో ప్రతినిధులు వెల్లడించారు.

రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని పోస్కో ప్రతినిధులకు సీఎం వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటునందిస్తాయని, పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయని సీఎం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details