రెక్కాడితే కానీ... డొక్కాడని నిరుపేదలను... కరోనా కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పొద్దంతా పనిచేస్తే గానీ పూట గడవని వారి బతుకుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. చాలామందికి ఎండాకాలంలో చేతినిండా పని దొరికేది. సంవత్సరం మొత్తంలో వచ్చే ఆదాయం... మార్చి నుంచి మే నెలల్లోనే సంపాదించేవారు. అలాంటిది కరోనా వల్ల పనిలేక... చేతిలో డబ్బు లేకుండా అవస్థలు పడుతున్నారు.
కుండలు చేసేవారు, దర్జీలు ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డు పక్కన చిల్లర దుకాణాలు, భోజన హొటల్, చిన్న చిన్న వస్తువులు విక్రయించి పొట్ట పోషించుకునే వారికి ఉపాధి కరవైంది. దుకాణాలన్నీ మూసేసి పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు.