కృష్ణా జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పర్యటించారు. మచిలీపట్నం, గూడూరు మండలం తుమ్మలపాలెంలో పర్యటించి..భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో చర్చించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ మాధవిలత, రెవెన్యూ శాఖ అధికారులు పంటలను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పూనం మాలకొండయ్య పర్యటన - వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం తాజా వార్తలు
కృష్ణా జిల్లాలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పూనం మాలకొండయ్య పర్యటన