ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయం 9.30 నుంచి పరీక్ష హాల్​లోకి అనుమతి - కృష్ణ జిల్లాలో ఏపీ పాలీసెట్ 2020

కృష్ణ జిల్లా పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పాలీసెట్​-2020 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా పాలీసెట్ కన్వీనర్‌ వీఎస్ చలపతిరావు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు.

ఉదయం 9.30 నుంచి పాలీసెట్ పరీక్ష హాల్​లోకి అనుమతిస్తాం: చలపతిరావు
ఉదయం 9.30 నుంచి పాలీసెట్ పరీక్ష హాల్​లోకి అనుమతిస్తాం: చలపతిరావు

By

Published : Sep 26, 2020, 4:40 PM IST

కృష్ణ జిల్లా పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పాలీసెట్​-2020 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కృష్ణా జిల్లా పాలీసెట్ కన్వీనర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ చలపతిరావు వెల్లడించారు.

మొత్తం 11 కేంద్రాలు..

విజయవాడ నగర పరిధిలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 3,546 విద్యార్ధులు ఈ పాలీసెట్ పరీక్షలు రాయనున్నట్లు చలపతిరావు పేర్కొన్నారు. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని సూచించారు. ఉదయం 9:30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుతిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

ABOUT THE AUTHOR

...view details