కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్లు ఏర్పాటు చేసింది. మైలవరంలోని పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కృష్ణాజిల్లాలో పోలింగ్ ప్రారంభం.. కరోనా సోకిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు - కృష్ణాజిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిడమానూరులో పోలింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
నిడమానూరులో పోలింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్ సిద్ధం చేశారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:పంచాయతీ పోరు: చిత్తూరు జిల్లా కమ్మకండ్రిగలో అభ్యర్థుల ఆందోళన