ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం రాజకీయం చేయడం వచ్చా అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, పేదలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలపై ప్రభుత్వాల దుర్మార్గాల్ని ఎండగట్టేందుకే దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడలో దర్నా చేపట్టామని శైలజానాథ్ అన్నారు.
దీటుగా ఎదుర్కొంటాం..
హత్యలు, దాడులను దీటుగా ఎదుర్కొంటామని.. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి ప్రభుత్వాల దుర్మార్గాల్ని వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. ఇక సామాన్యులను కలిసే అవకాశం ఏమిస్తారని ఎద్దేవా చేశారు.