ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం సేవించని సుధాకర్ తాగుబోతు ఎలా అవుతాడు..? - డాక్టర్ సుధాకర్ దాడి వార్తలు

దళిత డాక్టర్ సుధాకర్ దుస్థితికి ముఖ్యమంత్రి జగన్ కారకుడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అతని కుటుంబానికి ఏమి జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Polit Bureau member varla ramaiah conference on dr. sudhakar
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

By

Published : May 17, 2020, 11:07 PM IST

దళిత డాక్టర్ సుధాకర్ పరిస్థితికి సీఎం జగన్ కారకుడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ కుట్రలో భాగంగానే సుధాకర్​ను పిచ్చివాడిగా చిత్రించాలని ప్రభుత్వం యత్నించిందని విమర్శించారు. మద్యపానమే సేవించని సుధాకర్ తాగుబోతు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.

హోంమంత్రికి చిత్తశుద్ధి, నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని వర్ల డిమాండ్ చేశారు. దళిత డాక్టర్ సుధాకర్​పై దాడి జరిగితే వైకాపా మంత్రులు సిగ్గుపడాలన్నారు. నర్సీపట్నం ఆసుపత్రిలో సుధాకర్​ను తిరిగి నియమించాలని... కక్షపూరితంగా చేసిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

సుధాకర్ కుటుంబానికి ఏమి జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని వర్ల స్పష్టం చేశారు. సుధాకర్​పై దాడిని తెదేపా, దళిత వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్న వర్ల... ఆతనిని స్వేచ్ఛగా జీవించేలా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీచూడండి.పోతిరెడ్డిపాడు​పై తెదేపా మౌనమెందుకు?: మంత్రి అనిల్

ABOUT THE AUTHOR

...view details