కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలను డ్రోన్ల ద్వారా పిచికారి చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశానుసారం కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయిస్తున్నామని తహసీల్దార్ ఎం.సురేష్ కుమార్ చెప్పారు.
డ్రోన్ల ద్వారా రసాయన ద్రావణాల పిచికారి - corona news in krishna dst
కృష్ణా జిల్లానూజివీడులో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారి చేశారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ఈ విధంగా పిచికారి చేసినట్లు తహసీల్దార్ సురేష్ కుమార్ వివరించారు.
![డ్రోన్ల ద్వారా రసాయన ద్రావణాల పిచికారి police using drone cameras in krishna dst vijawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7034514-784-7034514-1588437912808.jpg)
police using drone cameras in krishna dst vijawada
వైరాలజీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం... ఇప్పటి వరకు నూజివీడుకు సంబంధించి ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇవికాక మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి అనుమానంగా ఉన్నట్లు తెలిపారు. విజయవాడలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ద్వారా సుమారు 40 మందికి వివిధ ప్రాంతాల్లోని వారికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. విజయవాడ నుంచి ఏ విధమైన సరకులను రవాణా చేయరాదంటూ సబ్ కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.