కలంకారీ పనులు చేసుకునే నాంచారమ్మ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణాజిల్లా పెడన బస్టాండ్ సమీపంలో నివసించేది. సోమవారం ఉదయం ఓ చిన్నారి మృతి చెందటంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. అదే రోజు మరో పసికూన కూడా ప్రాణాలు వదలటంతో.. నాంచారమ్మపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు.
తల్లే చంపిందా?
కృష్ణాజిల్లా పెడనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఒకే రోజు మృతి చెందారు. చిన్నారుల మరణానికి తల్లే కారణమని బంధువులు ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
చనిపోయిన చిన్నారుల తల్లి
బిడ్డల మృతి పట్ల పొంతన లేని సమాధానాలు చెప్పిన నాంచారమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Last Updated : Feb 20, 2019, 10:54 AM IST