కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో... పోలీసులు దాడులు చేశారు. ఆరు ఇసుక నింపిన ట్రాక్టర్లను పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తరలిస్తున్నామని డ్రైవర్లు తెలిపారు. ఇసుక తరలించేందుకు సరైన అనుమతులు లేకపోవడంతో ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను స్టేషన్కు తరలించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల పట్టివేత - కృష్ణా జిల్లా కంచికచర్ల ఇసుక వార్తలు
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు.
![అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల పట్టివేత police take over sand tractors at kanchikacherla in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5521477-346-5521477-1577531843416.jpg)
పోలీస్స్టేషన్లో ఇసుక ట్రాక్టర్లు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల పట్టివేత
TAGGED:
sand tractors latest news