ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిల్లబోయినపల్లిలో నలభై గోవుల అక్రమ రవాణా.. లారీ సీజ్ - చిల్లబోయినపల్లిలో లారీ సీజ్

అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని కృష్ణా జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నలభై మూగజీవాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

police take over forty cows at chinnaboinapalli
చిల్లబోయినపల్లిలో నలభై గోవుల అక్రమ రవాణా

By

Published : Jun 30, 2021, 1:10 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామం వద్ద ఓ లారీలో అక్రమంగా నలభై గోవులను తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు మూగ జీవాలను తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

హైవే మీద నుంచి వెళితే తనిఖీలు ఎక్కువగా ఉంటాయని... రహస్య మార్గాల ద్వారా అక్రమరవాణా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారంతో మూగజీవాలను ద్వారకాతిరుమల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details