POLICE STOPPED TDP LEADER KOLLU : వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమానికి గుడివాడ బయలుదేరిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై కొల్లు మండిపడ్డారు. రంగ వర్ధంతి చేయాలంటే మీ అనుమతి తీసుకోవాలా అని పోలీసులను ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నిచోట్ల రంగా వర్ధంతి కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.
రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాజీ ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర - వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం
KOLLU RAVINDRA : మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ బయలుదేరిన ఆయనను మధ్యలోనే అడ్డగించారు.
![రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాజీ ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర KOLLU RAVINDRA ARREST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17314642-628-17314642-1672048492458.jpg)
KOLLU RAVINDRA ARREST
రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు
"గుడివాడలో రంగా వర్ధంతిని పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చేయడానికి సన్నద్ధం అవుతుంటే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించారు. రంగాకి నివాళి అర్పించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆయన ప్రజలందరి మనిషి"-కొల్లు రవీంద్ర, టీడీపీ నేత
ఇవీ చదవండి:
Last Updated : Dec 26, 2022, 3:46 PM IST