హిందూ దేవాలయాలపై దాడులు, విజయవాడ దుర్గ గుడి రథంలోని వెండి సింహాల మాయం ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ అన్నారు. ఈ డిమాండ్‌తో విజయవాడ వన్‌టౌన్‌లో ఆందోళన చేపట్టారు. శాంతియుత ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
విజయవాడలో పోలీసులు, జనసైనికుల మధ్య తోపులాట - విజయవాడ జనసేన తాజా వార్తలు
దేవాలయాలపై దాడులకు నిరసనగా విజయవాడలో శాంతియుత ర్యాలీ చేపట్టిన జనసేన కార్యకర్తలను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట