సంక్రాంతి సందర్భంగా యువత కోడి పందేలు వేయకుండా నియత్రించేందుకు కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు... ఈ నెల 9,10,11 తేదీల్లో క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో వాలీబాల్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు ప్రారంభించారు. ఈ నెల 12న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు స్థానిక ఎన్టీఆర్ కాలనీలో గృహిణులకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు.
సంక్రాంతికి కోడి పందేలు కాదు... ఆటలాడండి! - latest news on sankranthi
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో యువత కోడి పందేలు, జూదం వైపు మరలకుండా కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. యువత ఆటలకు ప్రాధన్యమివ్వాలని పిలుపునిస్తూ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
అవనిగడ్డ పోలీసుల ఆటల పోటీలు