కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు, గుంటుపల్లి గ్రామాలలో పోలీసులు స్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, అందరూ సహకరించాలని ఇబ్రహీంపట్నం సీఐ కె.శ్రీధర్ కుమార్ కోరారు. విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ ఆదేశాల మేరకు సమస్యగా మారిన గ్రామాల్లో భాగంగా.. ములపాడు, కేతనకొండ, గుంటుపల్లి స్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో అందరూ కలిసి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని, ఏ విధమైన గొడవలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు 'స్లాగ్ మార్చ్' - పంచాయతీ ఎన్నికల వార్తలు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతూ...కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు స్లాగ్ మార్చ్ చేశారు.
ఇబ్రహీంపట్నం మండలంలో పోలీసులు 'స్లాగ్ మార్చ్'