సమాజానికి కనిపించే కరుడుగట్టిన పోలీస్ వెనుక.. కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయనీ.. వాటిని ప్రజలు అర్థం చేసుకోవాలని కృష్ణాజిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విద్యార్థులకు హీరో సూర్య నటించిన సింగం-3 సినిమా చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాలో కథానాయకుడు పడిన కష్టాల కన్నా.. నిజ జీవితంలో పోలీసులు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారన్నారు. అయినా ఇష్టంతో తమ బాధ్యతలను పూర్తి చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజలను కాపాడేందుకే అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
'విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు'
ఎన్ని కష్టాలున్నా విధి నిర్వహణలో పోలీసులు వెనకడుగు వేయరని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సినిమా చూపించారు.
నూజివీడులో పోలీసు అమరవీరుల దినోత్సవం