ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం..! - కృష్ణా జిల్లా, కంకిపాడు

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో... కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకువస్తున్నారు. అరుణాచల్​ప్రదేశ్ నుంచి తీసుకువస్తున్న మద్యం సీసాలను కృష్ణా జిల్లా మంతెనలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

krishna distrct
అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం.. నలుగులు అరెస్టు

By

Published : Jun 6, 2020, 5:52 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న 5162 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. కంకిపాడుకు చెందిన వీరంకి వెంకటరమణ, నిడమానూరుకు చెందిన కొండపల్లి ఆనంద్‌, షేక్‌ రఫీ, కృష్ణలంకకు చెందిన షేక్‌ మహబూబ్‌ సుబానీలను అరెస్టు చేశారు. మొక్కజొన్న లోడులో మద్యం సీసాలు ఉంచి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details