మద్యం అక్రమ రవాణా నివారణకు పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ దందా ఆగడం లేదు. ముఖ్యంగా కృష్ణాజిల్లా సరిహద్దులోనే ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా గన్నవరంలో పాలపర్తి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో తెలంగాణ మద్యం పట్టుబడింది. మద్యం విలువ 64,200 ఉంటుందని పోలీసులు తెలిపారు. 321 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోని నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని గన్నవరం కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
గన్నవరంలో తెలంగాణ మద్యం పట్టివేత - గన్నవరంలో తెలంగాణ మద్యం పట్టివేత
కృష్ణాజిల్లా గన్నవరంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

గన్నవరంలో తెలంగాణ మద్యం పట్టివేత