ఖమ్మం జిల్లా మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 785 మద్యం సీసాలను స్యాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ట్రక్కు అడుగు భాగంలో రహస్య అలమరలను ఏర్పాటు చేసి మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో తనిఖీ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ మద్యం పట్టివేత... 785 మద్యం సీసాల స్యాధీనం... - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత
ఖమ్మం జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు చెరువు కట్ట వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 785 మద్యం సీసాలను స్యాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ మద్యం పట్టివేత... 785 మద్యం సీసాల స్యాధీనం...