ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Illegal Transport of Ration: పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Illegal transport of Ration: రాష్ట్రంలోని పలుచోట్ల.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలో 25 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకోగా.. ప్రకాశంలో 90 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

lorry seazed for Illegal transport of Ration in krishna district
రాష్ట్రంలో పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Feb 23, 2022, 1:11 PM IST

Illegal transport of Ration: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్​లో.. లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో.. హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. 25 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకుని.. లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బియ్యం లారీ పామర్రు నుంచి కాకినాడ పోర్టుకు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా చీరాలలోని దండుబాటలో టాటా ఏస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న.. 90 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్​ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. చీరాల ఒకటవ పట్టణ సీఐ మల్లిఖార్జునరావు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details