కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని కోడిపందేలు, పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. విజయవాడ తూర్పు ఏసీపీ కె. విజయ్‌పాల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి శిబిరాలను ధ్వంసం చేశారు. గతంలో శిబిరాలు నిర్వహించిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా స్థలం యజమానులు డబ్బుకు ఆశపడి శిబిరాలు నిర్వహించడానికి లీజుకిచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మండలంలో ఇప్పటికే సుమారు 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కోడిపందేలు, పేకాట శిబిరాలు ధ్వంసం - కోడిపందేలు, పేకాట శిబిరాలు ధ్వసం న్యూస్
కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ తూర్పు ఏసీపీ కె. విజయ్‌పాల్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు.
కోడిపందేలు, పేకాట శిబిరాలు ధ్వసం