కడప జిల్లా ప్రొద్దుటూరులో నకిలీ చెక్కుల వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నకిలీ చెక్కులు సమర్పించి డబ్బులు తీసుకున్న వారిపై రెండో, మూడో పట్టణం, గ్రామీణ పీఎస్‌లలో బ్యాంకు మేనేజర్లు ఫిర్యాదు చేశారు. గ్రామీణ పీఎస్ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంకులో వినయ్‌కుమార్ రూ.3.60లక్షలు డ్రా చేయగా..మూడో పీఎస్ పరిధిలోని ఏడీబీ బ్యాంకులో శ్రీకాంత్ రూ.3.40 లక్షలు, రెండో పీఎస్ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంకులో రహమాన్ రూ. 2.90 లక్షలు డ్రా చేశారని పోలీసులు తెలిపారు.
సీఎం సహాయనిధి నకిలీ చెక్కులు వ్యవహారంపై పోలీసు కేసు నమోదు
సీఎం సహాయనిధి నకిలీ చెక్కుల వ్యవహారంపై కడప జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
సీఎం సహాయనిధి నకిలీ చెక్కులు వ్యవహారంపై పోలీసుల కేసునమోదు