విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 21న జరగనున్న నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సీపీ పరిధిలో గన్నవరం, ఆత్కూరు, ఉంగుటూరు, పమిడిముక్కల, ఉయ్యూరు పట్టణ, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 4 మండలాల్లో మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 59 అతి సమస్యాత్మకమైన, 75 సమస్యాత్మకమైనవి, 68 సాధారణ పోలింగ్ ప్రదేశాలుగా గుర్తించారు.
నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం.. పోలీసుల భారీ బందోబస్తు - విజయవాడలో నాలుగో విడత ఎన్నికలు తాజా వార్తలు
21న జరగనున్న నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసులు సిద్దమవుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

జయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ జరుగు ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నగర కమిషరేట్ పరిధిలో ఉన్న 335 మంది రౌడీషీటర్లతోపాటుగా నేర చరిత్ర ఉన్న 1881 మందిని బైండోవర్ చేయడంతో పాటు వారిపై 372 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి..