కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని అన్నెరావుపేట తండాలో పోలీసులు నాటుసారా విక్రయ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాలతో రెడ్డిగూడెం ఎస్ఐ శ్రీనివాస్.. తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గత 3 రోజుల నుంచి దాడులు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - కృష్ణా జిల్లా నేరాలు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్తో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో నాటుసారా తయారీ ఊపందుకుంది. కృష్ణా జిల్లా మైలవరంలో అక్రమ సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు