ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - natu sara latest news

నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేసి... 40 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా తుంగలవారిపాలెంలో జరిగింది.

sara caught by police
నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు

By

Published : Aug 16, 2020, 8:11 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటు సారా స్థావరాలపై పోలీసులు మెరుపుదాడులు చేసారు. అవనిగడ్డ పరిధిలో తుంగలవారిపాలెం లంకలో సారా తయారు చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాగాయలంక స్టేషన్ పరిధిలో సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు నాగాయలంక ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details