ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసుల వరుస దాడులు - CP Rabindranath Babu in Krishnajilla

తెలంగాణ మద్యం రాష్ట్రానికి అక్రమంగా తీసుకువస్తున్న వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాలలో తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్టు చేశారు.

krishna distrct
జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు వరుస దాడులు

By

Published : Jul 29, 2020, 5:18 PM IST

కృష్ణాజిల్లాలో సీపీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చందర్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని ముప్పాళ్ళ గ్రామం నుంచి మునగాలపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డులో తరలిస్తున్న 308 మద్యం సీసాలను, వాహనాలను సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

పామర్రు బాపూజీపేటలో రెండు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండినూతన సౌర విద్యుత్ ప్రాజెక్టుకు స్టాంపు డ్యూటీ మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details