కృష్ణా జిల్లావ్యాప్తంగా గుట్కా నిల్వలు, నాటు సారా తయారీ, అక్రమ మద్యం రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రత్యేక డ్రైవ్లో మద్యం రవాణాకు సంబంధించి 44 కేసులు, గుట్కాపై 35, నాటు సారా తయారీపై 8 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచిన గోడౌన్లపై ఏక కాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. గుట్కా, నాటుసారా, అక్రమ మద్యం కేసులలో 100 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. కొందరి స్వప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని.. వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా 5 సబ్ డివిజన్ల పరిధిలోని మారుమూల గ్రామాల్లో సోదాలు నిర్వహించి.. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.12 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని.. 38 మంది వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం కేసుల్లో 54 మంది వ్యక్తులను అరెస్టు చేసి.. 2239 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2 కార్లు, 9 ద్విచక్ర వాహనానలను సీజ్ చేశామన్నారు.
పాన్ షాప్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు..