కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామ శివారులలో కోడి పందేలు ఆడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కోడిపందేలు నిర్వహిస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు పందెం కోళ్లు, రూ. 24,660 నగదు, 11 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్నవారిపై 9(II) గేమింగ్ చట్టం, యానిమల్ కూృయల్టీ చట్టాలకింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి.. - మాగల్లు గ్రామ శివారులలో కోడి పందాలు
కృష్టా జిల్లా మాగల్లు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 23 మందిని అదుపులోకి తీసుకుని పలు చట్టాల కింద కేసు నమోదుచేశారు.
కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి