విజయవాడ నగర శివారులో కొత్తూరు, తాడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ బూత్‌లను విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాసరావు పరిశీలించారు. గ్రామాల్లో సమస్యాత్మక ప్రాతాలు ఎమైనా ఉన్నాయా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. పర్యటనలో సీపీ వెంట ఏడీసీపీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు ఉన్నారు.
కృష్ణా జిల్లా పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సందర్శించారు. జిల్లాలో గుడివాడ డివిజన్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిన్నట్టు తెలిపారు. జిల్లాలో సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తూ.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.