POLICE ARREST THE VARLA RAMAIAH SON : కృష్ణా జిల్లా పామర్రులో తెలుగుదేశం నేత వర్ల కుమార్ రాజా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అతడిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా శ్రేణులను పోలీసులు ఈడ్చేశారు. కుమార్ రాజాకు రక్షణగా నిలిచిన మహిళలనూ లాగేశారు. కుమార్ రాజాతో పాటుగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కుమార్ రాజా అరెస్ట్‌కు నిరసనగా తెదేపా కార్యకర్తలు పామర్రు-విజయవాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పామర్రులో వర్ల కుమార్ రాజా దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు - వర్ల కుమార్ రాజా దీక్ష
POLICE ARREST TDP LEADER VARLA KUMAR : తెదేపా శ్రేణులపై దాడి చేస్తున్న వైకాపా నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు పార్టీ నేత వర్ల కుమార్ రాజా చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా శ్రేణులు పామర్రు-విజయవాడ రహదారిపై రాస్తోరోకో నిర్వహించారు.

POLICE ARREST THE TDP LEADER VARLA KUMAR
వర్ల కుమార్ రాజా దీక్ష భగ్నం.. అరెస్టు చేసి ఆసుపత్రికి తరలింపు
చంద్రబాబు ఫోన్: వర్ల కుమార్ రాజాను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. 'బడుగులను బతకనివ్వండి-ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అంటూ మూడు రోజులుగా కుమార్ రాజా చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు తీరును చంద్రబాబు ఖండించారు. బడుగు వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా కుమార్ రాజా చేపట్టిన పోరాటాన్ని అభినందించారు. ఈ తరహా పోరాటాలతో ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 19, 2022, 10:43 PM IST