విజయవాడ పోలీస్ కమిషనరేట్, పెనమలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. గ్రామాల్లో ఎన్నికల దృష్ట్యా... ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు, ఆసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో భాగంగా... ఈ కార్యక్రమం చేపట్టామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
'ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు' - కృష్ణా జిల్లా నేటి వార్తలు
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కృష్ణా జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో పోలీసుల కవాతు