కృష్ణా జిల్లా నందిగామలో నగర పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని.. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని.. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. ప్రతి ఒక్కరు నిబంధనలు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. విరుద్ధంగా వ్యవహరిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం, డబ్బు పంపిణీపై వెంటనే సమాచారం తెలియజేయాలని కోరారు.