ఇంద్రకీలాద్రిపై జేసీ శివశంకర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు - ap latest news
11:53 October 08
దసరా పనుల పర్యవేక్షణకు వస్తున్న జేసీ కారును ఆపేసిన పోలీసులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దసరా పనుల పర్యవేక్షణకు కారులో ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ వాహనాన్ని కొండ దిగువనే అడ్డుకున్నారు. తాను పనుల పర్యవేక్షణ కోసమే వస్తున్నానని చెప్పినా వినకుండా.. అడ్డుకున్నారని జేసీ అసహనం వ్యక్తం చేశారు.
సీఐ ప్రవర్తనపై జేసీ శివశంకర్ సీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ.. సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ.. జేసీ కొండ దిగువ నుంచి కాలినడకన వెళ్లారు. ఘాట్ రోడ్డు మీదుగా వచ్చి మార్గ మధ్యలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి:Thirumala Brahmotsavalu: చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు