ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్మీపురంలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై ఆందోళన - లక్ష్మీపురంలో పోలీసులు వార్తలు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో గ్రామస్థులు ఆందోళన చేశారు. పోలీసులు కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని అక్కడినుంచి తీసేసి.. కృష్ణానదిలో నిమజ్జనం చేశారని ఆరోపించారు.

Police immersed Kanakadurga idol  at laxmipuram
లక్ష్మీపురంలో ఉద్రిక్తత

By

Published : Oct 18, 2020, 11:12 PM IST


కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో ఉద్రిక్తత నెలకొంది. నవరాత్రుల కోసం అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటే.. పోలీసులు తొలగించి కృష్ణా నదిలో నిమజ్జనం చేశారని గ్రామస్థులు ఆరోపించారు.

ఇలా జరగడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఈ సంఘటన హిందూవుల మనసు కలచివేసిందన్నారు. ప్రభుత్వం వివక్ష ధోరణి విడనాడి.. హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details