ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా.. 8,962 మంది వీధి బాలల గుర్తింపు - Found Huge Street Children in Kurnool

ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా జరిపిన తనిఖీల్లో సుమారు 8,692 మంది వీధి బాలలను పోలీసులు సంరక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బస్టాండ్, రైల్వేస్టేషన్లు, కార్యాలయాలు, హోటళ్లు, పరిశ్రమలు, రద్దీ కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఆపరేషన్ ముస్కాన్​@ 8,962 మంది వీధి బాలల గుర్తింపు
ఆపరేషన్ ముస్కాన్​@ 8,962 మంది వీధి బాలల గుర్తింపు

By

Published : Oct 31, 2020, 6:57 AM IST

రాష్ట్రంలో పోలీసులు జరిపిన ఆపరేషన్ ముస్కాన్​లో 8,692 మంది వీధి బాలలను పోలీసులు సంరక్షించారు. అన్ని జిల్లాల్లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కార్యాలయాలు, హోటళ్లు, పరిశ్రమలు, రద్దీ కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. పనిలో మగ్గిపోతున్న చిన్నారులను గుర్తించారు.

వేల సంఖ్యలో గుర్తింపు..

పనులు చేస్తున్న వీధిబాలలు వేల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంరక్షించిన వారిలో 7,278 మంది బాలురు కాగా 1,414 మంది బాలికలున్నారని తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వీరందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించి శానిటైజర్, మాస్క్​లు అందజేశారు.

అక్కడ అత్యధికంగా..

కర్నూలులో అత్యధికంగా 1509 మంది వీధి బాలలను పోలీసులు రక్షించారు. ప్రకాశం జిల్లాలో 1258 మంది వీధి బాలలను కాపాడారు.

ఇవీ చూడండి:

డిసెంబర్ 1 నుంచి డిగ్రీ, బీటెక్​ ఫస్టియర్ తరగతులు

ABOUT THE AUTHOR

...view details