కృష్ణ జిల్లా తిరువూరులో ఓ పత్రిక విలేకరి కుమార్తె చదువు కోసం పోలీసులు సాయం చేశారు. గ్రామానికి చెందిన ఓ పత్రికలో పనిచేస్తున్న విలేకరి నాగరాజుకు ముగ్గురు కుమార్తెలు. వారిని చదివించేందుకు ఆర్థిక స్థోమత లేక నాగరాజు ఇబ్బంది పడుతున్నాడు. అతడి రెండో కుమార్తె శ్రీ లక్ష్మి విజయవాడలో దంత వైద్య విద్యను చదువుతోంది. ఫీజులు కట్టలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగరాజు ఎస్పీకి వాట్స్అప్ ద్వారా తెలియపరచాడు. స్పందించిన ఎస్పీ... శ్రీ లక్ష్మి చదువుకోసం కృష్ణా జిల్లా పోలీసు శాఖ తరపు నుంచి 55 వేల రూపాయల చెక్కును అందజేశారు.
విలేకరి కుమార్తె చదువుకోసం పోలీసుల సాయం - తిరువూరులో పత్రిక విలేఖరికి పోలీసుల సాయం
కృష్ణా జిల్లా పోలీసులు పెద్దమనసు చాటారు. ఫీజులు కట్టలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నఓ పత్రిక విలేకరి కుమార్తె చదువుకు నగదు సాయం చేశారు.
![విలేకరి కుమార్తె చదువుకోసం పోలీసుల సాయం police helps to journalist daughter at tiruvur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8372269-877-8372269-1597093583690.jpg)
విలేఖరి కుమార్తె చదువుకోసం పోలీసుల సాయం