తప్పిపోయి ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని విజయవాడ పోలీసులు వృద్దాశ్రమానికి తరలించారు. తన ఆచూకీ మర్చిపోయి నగర శివారులో ఒంటరిగా కూర్చున్న వృద్ధురాలిని నున్న గ్రామీణ పోలీసులు గుర్తించారు. ఆ వృద్ధురాలని స్థానిక వాంబేకాలనీలోని మాతృమూర్తీ వృద్ధ ఆశ్రమానికి తరలించారు. ఆమె పేరు తిరపతమ్మ, కృష్ణలంక వాసిగా చెబుతుందని.. ఎవరైనా ఆచూకీ తెలిసినవారు నున్న పోలీసులను సంప్రదించాలని ఎస్సై పవన్ తెలిపారు.
తప్పిపోయిన వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించిన పోలీసులు - విజయవాడ తాజా వార్తలు
తన ఆచూకీ మర్చిపోయి ఒంటరిగా విజయవాడ నగర శివారులో కూర్చున్న వృద్ధురాలిని నున్న గ్రామీణ పోలీసులు స్థానిక వృద్దాశ్రమానికి తరలించారు.
![తప్పిపోయిన వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించిన పోలీసులు వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12090159-498-12090159-1623351540200.jpg)
వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించిన పోలీసులు