కృష్ణా జిల్లా భవానీపురం పోలీస్ స్టేషన్లో వాహనాల దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ హసీనా తన భర్త అప్రోజ్ ఆదేశం మేరకు అహ్మద్ అనే మరో ఆటో డ్రైవర్ అప్రోజ్ సాయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆటో పక్కనున్న వాహనాలకు సైతం మంటలు అంటుకుని మొత్తం 10 వాహనాలు దగ్ధమయ్యాయి.
పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల దగ్ధం కేసును ఛేదించిన పోలీసులు - Bhavanipuram police station case news
భవానీపురం పోలీస్ స్టేషన్లో వాహనాల దగ్ధం కేసు ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త చెప్పిన మాటలు విని ఓ మహిళ ఆటోకు నిప్పంటించిందని.. దీంతో పక్కనున్న వాహనాలు సైతం కాలిపోయాయని పోలీసులు తెలిపారు.
భవానీపురం పోలీస్ స్టేషన్
సంఘటన జరిగిన సమీపంలో అనుమానాస్పదంగా కనపడిన హసీనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే తగులబెట్టానని విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలిపోయిన వాహనాల పత్రాలు పరిశీలించి.. చట్టపరంగా రావాల్సిన ఇన్సూరెన్స్ త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి