ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదుపై కేసు నమోదు - vallabjaneni vamshi latest complaint in police station
సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదుపై కేసు నమోదు
By
Published : Nov 23, 2019, 5:40 AM IST
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదుపై కేసు నమోదు
తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ, ఫొటో సైతం మార్ఫింగ్ చేశారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. కొద్దిరోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని సీపీ ద్వారకా తిరుమలరావుకు వంశీ ఫిర్యాదు చేశారు.