కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లోనే నిందితులైన పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామని దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్ తెలిపారు.
నిందితులిద్దరికీ మద్యం సేవించడం, వ్యభిచార గృహాలకు వెళ్లడం వంటి చెడు వ్యసనాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలోనే పల్లిపాలెం బీచ్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లి వస్తున్న యువతిపై పోసిన నాగబాబు అత్యాచారం చేయగా మణిదీప్ సహకరించారని వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితులను అరెస్ట్ చేసినట్టు మచిలీపట్నం డీఎస్పీ మాసుమ్ బాషా తెలిపారు.