జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(MLA samineni Udayabhanu) కుమారుడు కృష్ణప్రసాద్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు(false posts on social media) పెట్టిన నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టకుంటామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు.. ఒకరు అరెస్టు - jaggayyapeta latest news
ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(MLA samineni Udayabhanu) కుమారుడిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు ఫార్వార్డ్ చేశారని అన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తెదేపా సానుభూతిపరులుగా ఉన్న నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు ఫార్వార్డ్ చేశారని.. వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ముద్దాయిలు ఐదుగురు పలు సామాజిక గ్రూప్‌ల్లో మెసేజ్ ఫార్వార్డ్ చేశారని, నిరాధారమైన వార్తలు పోస్ట్, ఫార్వార్డ్ చేసినా చట్టరీత్యా నేరమని పోలీసులు అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా నాయకులు ఆరోపించినట్లు ముద్దాయి కుటుంబ సభ్యులను తాము హింసించలేదన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి