కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఎదురుమొండిలో ఈనెల 29వ తేదిన తల్లిదండ్రులపై దాడి చేసి తల్లి వీరలంకమ్మను హతమార్చిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు వీరరాఘవయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు.
భార్య దూరం కావడానికి తల్లే కారణమని చంపేశాడు - నాగాయలంక నేర వార్తలు
కృష్ణాజిల్లా నాగాయలంకలో తల్లిదండ్రులపై దాడి చేసి తల్లిని చంపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య దూరంగా ఉండటానికి తల్లిదండ్రులే కారణమని భావించి ... ఈ ఘాతుకానికి పాల్పడాడని వెల్లడించారు.
నాగాయలంక కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
భార్య దూరంగా ఉండటానికి తల్లిదండ్రులే కారణమని భావించి ... ఈ ఘాతుకానికి పాల్పడాడని పోలీసులు వెల్లడించారు. నిందితునిపై 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరరాఘవయ్య దాడిలో గాయపడిన తండ్రి నాగేశ్వరరావు అత్యవసర వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండీ...ఆదమరిస్తే అనంత లోకాలకే...