కృష్ణా జిల్లా కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో కృష్ణాష్టమి ఊరేగింపులో అశ్లీల నృత్యాల కేసులో కైకలూరు పోలీసులు 31 మందిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. రెండు ట్రాక్టర్లు, టాటా ఏసీ వాహనాలు, ఊరేగింపునకు ఉపయోగించిన రెండు డీజే సౌండ్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ARREST: అశ్లీల నృత్యాల కేసులో 31 మంది అరెస్టు - obscene dance in Tamarakollu village
కృష్ణా జిల్లా తామరకొల్లు గ్రామంలో అశ్లీల నృత్యాల కేసులో పోలీసులు.. 31 మందిని అరెస్టు చేశారు. రెండు ట్రాక్టర్లు, రెండు టాటా ఏసీ వాహనాలు, రెండు డీజే సౌండ్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
31 మంది అరెస్టు
అశ్లీల నృత్యాలకు పాల్పడిన ఐదుగురు హిజ్రాలను గుర్తించామన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. కైకలూరు పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి