ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police help: తప్పిపోయిన వృద్ధురాలిని ఇంటికి చేర్చిన పోలీసులు

ఖాకీలు జులుం ప్రదర్శించటం చూసే ఉంటాం... కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రజలపై పోలీసులు విరుచుకుపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అలా అని పోలీసులందర్నీ తప్పుపట్టలేం. ఖాకీల్లో కాఠిన్యమే కాదు.. మానవత్వం కూడా ఉంటుందని అనేకసార్లు నిరూపించారు. అలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో జరిగింది.

తప్పిపోయిన వృద్ధురాలిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు
తప్పిపోయిన వృద్ధురాలిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు

By

Published : Jun 11, 2021, 9:47 PM IST

పోలీసులంటేనే అందరికీ ఒక రకమైనా భయం ఉంటుంది... ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్లు అసలూ ఊరుకోరు. కొన్నిసార్లు లాఠీలకు పని చెప్తారు. దీంతో వీళ్లు అనేకసార్లు విమర్శల పాలవుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో వాళ్లు అలా ప్రవర్తించినా.. వాళ్లలో కూడా మానవత్వం ఉంటుంది. వాళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యంగా కొవిడ్​ లాంటి సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటూ... ప్రజలెవరూ ఈ మహమ్మారి బారిన పడకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడి ఉన్న సమయంలోనూ వారు తప్పిపోయిన ఓ వృద్ధురాలిని.. కుటుంబ సభ్యుల చెంతకు చేర్చి శభాష్​ అనిపించుకున్నారు.

ఏం జరిగింది..

విజయవాడ వాంబే కాలనీలో గురువారం సాయంత్రం.. సమయం 6 గంటలు కావొస్తోంది. కర్ప్యూ సమయం కావటంతో పోలీసులు విధుల్లో ఉన్నారు. అదే సమయంలో అక్కడక్కడే తిరుగుతూ ఓ వృద్ధురాలు పోలీసుల కంటపడింది. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా..వృద్ధ్యాప్యం కారణంగా ఏం చెప్పలేని స్థితిలో ఉంది. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి వచ్చిందో తెలియకపోవటంతో... ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. తప్పిపోయిన ఓ వృద్ధురాలు నున్న పోలీసుల సంరక్షణలో ఉందని పోలీసులు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న.. మనుమడు పవన్ నున్న పోలీసులను సంప్రదించగా ఆమెను అప్పగించారు.

మనకెందుకులే అనుకునే ఈ రోజులలో..బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్న వృద్ధురాలిపై శ్రద్ధ చూపి కుటుంబీకులకు అప్పగించిన నున్న పొలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.

ఇవీ చదవండి

అసత్య ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు: బాబూరావు

ABOUT THE AUTHOR

...view details