కృష్ణాజిల్లా కైకలూరులో మాజీ ఎంపీకి చెందిన స్థిరాస్తి వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై షణ్ముకం తెలిపారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అనుచరులు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో వెంచర్ ఏర్పాటు చేసి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఓ పత్రికా సంపాదకుడు అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పత్రికలో కథనాలు ప్రచురిస్తున్నందుకు మాజీ ఎంపీ అనుచరులు దుర్గాప్రసాద్, సురేంద్రలు తనపై ఆచవరం-విజరం గ్రామ సరిహద్దులో దాడి చేశారని పత్రికా సంపాదకుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.రెండు కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
స్థిరాస్తి వ్యవహారంలో ఇరువర్గాలపై కేసులు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - ex mp gokaraju rangaraju news
కృష్ణాజిల్లా కైకలూరులో మాజీ ఎంపీకి చెందిన స్థిరాస్తి వ్యవహారంలో ఇరువర్గాలపై కేసులు నమోదైనట్లు ఎస్సై షణ్ముకం తెలిపారు. ఓ వర్గం వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కథనాలు ప్రచురిస్తున్న మరో వర్గంపై దాడికి పాల్పడిన కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు