కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అక్రమ మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లావ్యాప్తంగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.
భారీగా మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం - మచిలీపట్నం అక్రమ మద్యం ధ్వంసం తాజా వార్తలు
ఒక వైపు కరోనా కోరలు చాచుతుంది.. మరో వైపు ఆకలి చావులు మరణ మృధంగం మోగిస్తున్నాయి. అయినప్పటికీ మద్యం మహమ్మారి అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగిపోతుంది. దీనిపై దృష్టి సారించిన కృష్ణా జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ మద్యాన్ని రోడ్డు రోలర్తోధ్వంసం చేశారు.
పెద్ద ఎత్తున అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు
72 లక్షల విలువ చేసే 14 వేల మద్యం సీసాలను ధ్వంసం చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి. మోహన్ రావు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏఎస్పీ వకుల్ జిందాల్, ఎక్సైజ్ సూపరిండెంట్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...
చిట్టీల పేరుతో టోకరా.. రూ.5 కోట్లతో ఉడాయింపు
Last Updated : Jul 18, 2020, 11:28 AM IST